Kaizer News

విండీస్ టీమ్‌లో మరో పూరన్.. ఈ కొత్త 'పూరన్' మామూలో

విండీస్ టీమ్‌లో మరో పూరన్.. ఈ కొత్త 'పూరన్' మామూలోడు కాదు!

· National - India · sakshi.com

భారత్‌తో జరిగే 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్ల‌కు టీమ్‌లకు కూడా షై హోప్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవల సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఆడిన జట్లలో పెద్దగా మార్పులు చేయకుండా టీమ్‌లను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకుంటున్న హెట్‌మైర్‌ను టీ20లకే ఎంపిక చేయగా, సీనియర్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌కు ఈ సిరీస్‌లనుంచి విశ్రాంతి కల్పించారు. ఎవరీ కామిల్ పూరన్? అయితే ఈ జట్టు ఎంపికలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు 'కామిల్ పూరన్'. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026) లో సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ఓపెనర్‌గా చెలరేగిపోవడంతో ఈ విధ్వంసకర ఆటగాడికి తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కింది. స 8 ఇన్నింగ్స్‌ల్లోనే 160 స్ట్రైక్ రేట్, 39 సగటుతో 273 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. 30 ఏళ్ల పూరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో కలిపి 333 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడం ఇతడి ప్రత్యేకం. లిస్ట్-ఎ క్రికెట్‌లో పెద్దగా రాణించకపోయినా, టీ20ల్లో మాత్రం పూరన్ ఫామ్ చూస్తుంటే భారత బౌలర్లకు అతడితో గండం తప్పదనిపిస్తోంది. భారత్‌కు విటల్ సవాల్? మరోవైపు విండీస్ 19 ఏళ్ల యంగ్ స్పిన్ సంచలనం 'విటల్ లాస్' నుంచి భారత బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. జూలైలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ ద్వారా అరంగేట్రం చేసిన లాస్.. తన సంచలన బౌలింగ్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. స్పిన్‌ను అద్భుతంగా ఆడగలిగే కివీస్ బ్యాటర్లే అతడి ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. ఇప్పటివరకు ఆడిన 5 వన్డేల్లో 5.3 ఎకానమీతో 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇటీవలి సీపీఎల్‌ లోనూ మెరిసిన ఈ యంగ్ స్పిన్నర్, టీమిండియాను ఏ మేర తిప్పలు పెడతాడో చూడాలి. విండీస్‌ వన్డే జట్టు : హోప్‌ (కెప్టెన్‌), జ్వెల్‌ ఆండ్రూ, జాన్‌ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్‌ గ్రీవ్స్, అమీర్‌ జంగూ, అల్జారి జోసెఫ్, షామర్‌ జోసెఫ్, విటెల్‌ లాస్, గుడకేశ్‌ మోతీ, కీమో పాల్, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్, జేడెన్‌ సీల్స్‌. విండీస్‌ టి20 జట్టు: హోప్‌ (కెపె్టన్‌), జ్వెల్‌ ఆండ్రూ, రోస్టన్‌ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్‌ హెట్‌మైర్, అకీల్‌ హొసీన్, షామర్‌ జోసెఫ్, గుడకేశ్‌ మోతీ, కీమో పాల్, కామిల్‌ పూరన్, రావ్‌మన్‌ పావెల్, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్, క్వింటన్‌ సాంప్సన్, రొమారియో షెఫర్డ్, షామర్‌ స్ప్రింగర్‌. చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్‌? హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News