కేజీఎఫ్ 2 తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌తో యశ్ నటించిన టాక్సిక్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. యశ్ నటన, గ్రాండ్ విజువల్స్‌పై ప్రశంసలు దక్కుతుండగా, గందరగోళమైన స్క్రీన్‌ప్లే, ఎక్కువ పాత్రలు, బోల్డ్ యాక్షన్ సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కథను తొలుత కోలీవుడ్ స్టార్ సూర్యకు చెప్పారని, ఆయన తిరస్కరించడంతో యశ్ హీరోగా ఎంపికయ్యాడనే వార్త వైరల్‌గా మారింది