సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్న తాజా పరిణామాలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని ఆమె అన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ నిజం మరోసారి నిర్ధారణ అయిందని రోజా పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటగట్టే ప్రయత్నం చేసిన వారు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని అన్నారు. అలాగే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం కూడా ఇకనైనా ఆపాలని ఆమె అంటున్నారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేల నిజం నిర్ధారణ. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టే ప్రయత్నం చేసిన కళంకితులు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలి. పచ్చి పాలు లాంటి మనసు… pic.twitter.com/TLc3MprUnB ‘‘పచ్చి పాలు లాంటి మనసు జగనన్నది. పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదు. జగనన్న పాలనలో కూడా కల్తీకి ఆస్కారం ఉండదు. అంతా పవిత్రమేనని బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైంది’’ అని ఆర్.కే. రోజా తన పోస్టులో పేర్కొన్నారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? అని చంద్రబాబును ఉద్దేశించి మరో ట్వీట్‌లో రోజా ప్రశ్నించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు @ncbn గారూ? ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? #NoAnimalFatInTTDLaddu … pic.twitter.com/i4Z1JjtQOd తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..! కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు