Shorts హనుమకొండ: ఉద్యమ సమయంలో ప్రజల కోసం, సమాజం కోసం ముందుండి పోరాడిన ఉద్యమకారిణి రహీమున్నీసా బేగం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆమెను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఊపిరితిత్తుల సమస్యతో హనుమకొండలోని ఏకశిలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహీమున్నీసా బేగం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా “చికిత్సకు ఖర్చెంతైనా పర్వాలేదు.. మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత. రహీమున్నీసా బేగం ఆరోగ్యం కోసం అవసరమైన సహాయం అందిస్తాను” అని ఎమ్మెల్యే నాయిని భరోసా ఇచ్చారు. తన జీవితాన్ని కుటుంబం కంటే సమాజానికి, ప్రజల కోసం అంకితం చేసిన రహీమున్నీసా బేగం వంటి ఉద్యమకారిణి కష్టకాలంలో ఒంటరిగా ఉండకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే నాయిని ఆమె కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. “మీ కుటుంబానికి నేను ఉన్నాను.. ధైర్యంగా ఉండండి” అంటూ వారికి భరోసా కల్పించారు. రహీమున్నీసా బేగం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆకాంక్షించారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’