Kaizer News

Alluri: బంధవీధిలో కలెక్టర్ నిశాంతి ప్రజా ఫిర్యాదుల

Alluri: బంధవీధిలో కలెక్టర్ నిశాంతి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

· State - Telangana · hmtvlive.com

Shorts అల్లూరు జిల్లా: పాడేరు జిల్లా కలెక్టర్ జి మాడుగుల మండలం బంధవీధి GTWA పాఠశాల ప్రాంగణంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 46 ఫిర్యాదులు నమోదు – సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు కలెక్టర్ నిశాంతి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకువెళ్లి, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం జి.మాడుగుల మండలంలోని బంధవీధి GTWA పాఠశాల ప్రాంగణంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (PGRS) నిర్వహించారు. ప్రతి శుక్రవారం ITDA సమావేశ మందిరంలో PGRS నిర్వహించడంతో పాటు, ప్రతి నెలలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడే PGRS నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలకు పరిష్కార వేదికను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ స్వయంగా గ్రామాలను సందర్శించి, సంబంధిత జిల్లా అధికారులు కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా బంధవీధి లో నిర్వహించిన PGRSలో గ్రామస్థులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 46 ఫిర్యాదులు నమోదు కాగా. ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, సంబంధిత అధికారులతో కలిసి అక్కడే పరిశీలించి ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకుని సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నిశాంతి, ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది మరియు పాల్గొన్న వారందరితో స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిసరాల పరిశుభ్రతను కాపాడటంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. PGRS కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, అధ్యక్షతన సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం (Coordination Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో వివిధ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, పెండింగ్ అంశాలు మరియు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటికి సత్వర పరిష్కారం చూపేలా అధికారులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో PO ITDA శ్రీ ఆదిత్య వర్మ, IAS, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ M.V.S. లోకేశ్వరరావు, RDO శ్రీ M. భుజంగరావు, G. మాడుగుల MPP శ్రీ లుంబోరి అప్పలరాజుతో పాటు జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News