హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెల 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ వెల్ఫేర్ కమిషనర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో 350 మందిని ఎంపిక చేయనుండగా.. 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారని వెల్లడించారు. విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న లేదా చదవాలనుకునే అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు, ఇతర వివరాల కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ http://www.telanganaepass.cgg.gov.in చూడాలని కమిషనర్ సూచించారు