Kaizer News

Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..

· Sports · ntvtelugu.com

Abhishek Sharma: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మొన్న జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే రికార్డు శతకం (సెంచరీ) బాది విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ భారత్-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన టీ20 సిరీస్ కేవలం మైదానంలో పరుగుల వర్షంతోనే కాకుండా, స్టేడియం బయట ఫ్యాన్స్ చేసే హంగామాతో కూడా బాగా వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులతో ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన చిన్న సరదా ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులోనూ ఓ ఆఫ్ఘన్ మహిళా ఫ్యాన్ ఇచ్చిన సమాధానం నెటిజన్లను బాగా నవ్విస్తోంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News