Kaizer News

వరంగల్ విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

వరంగల్ విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

· State - Telangana · prabhanews.com

సీఎం రేవంత్‌రెడ్డికి దళిత విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ విజ్ఞప్తి హనుమకొండ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : చారిత్రక వరంగల్‌లోని మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ పేరు పెట్టాలని దళిత విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఈదునూరి వెంకటేశ్వర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం జరిగిందని, రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన వరంగల్‌కు కాకతీయుల రాజధానిగా విశిష్ట చరిత్ర ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో రాజ్యాంగ నిర్మాతగా, విద్యావేత్తగా, మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ పేరును వరంగల్‌ విమానాశ్రయానికి పెట్టడం సముచితమని తెలిపారు. విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసి, దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని కోరారు. విమానాశ్రయంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన జీవిత చరిత్ర, రచనలు, పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలతో ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకునే పౌరులు ఈ ప్రతిపాదనకు మద్దతుగా ఐక్యంగా ముందుకు రావాలని డాక్టర్‌ ఈదునూరి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు

Original source: prabhanews.com
Read more on Kaizer News