Kaizer News

ప్రతీ విషయంలో వివక్షే!

ప్రతీ విషయంలో వివక్షే!

· Entertainment · ntnews.com

కథానాయిక తాప్సీకి వివాదాలు కొత్తేమి కాదు. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం ఈ భామ నైజం. తాజాగా ఇండస్ట్రీలో కథానాయికలపై చూపించే వివక్ష గురించి తాప్సీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కెరీర్‌ ఆరంభంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంది. ‘షూటింగ్‌ టైంలో హీరోయిన్స్‌ కొన్ని గంటల ముందే సెట్స్‌కి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే హీరోలు వస్తారు. మాకు సమకూర్చే వసతులు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. కెరీర్‌ ఆరంభంలో ఓ సినిమాలో నాపై భారీ స్థాయిలో ఓ ఇంట్రడక్షన్‌ సీన్‌ తీశారు. కానీ తర్వాత ఆ సన్నివేశాన్ని మొత్తం తొలగించారు. దర్శకుడిని ఆరా తీస్తే.. హీరో చెప్పడం వల్లే ఆ సీన్‌ను తీసివేశారని తెలిసింది. అదే సినిమాలో ఓ డైలాగ్‌ని మార్చడానికి నేను అంగీకరించలేదు. కావాలంటే మ్యూట్‌ చేయండి అని చెప్పాను. థియేటర్‌లో చూస్తే ఆ ఒక్క సంభాషణను మార్చి వేరే డబ్బింగ్‌ ఆర్టిస్టుతో చెప్పించారు. ఇలా చాలా విషయాల్లో హీరోయిన్లపై వివక్ష చూపిస్తారు’ అని చెప్పుకొచ్చింది తాప్సీ

Original source: ntnews.com
Read more on Kaizer News