Shorts కడప: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసుల బైండవర్ చర్యలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా వైసీపీ నేతలను మాత్రమే బైండవర్ చేయడం సరికాదని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఈ మేరకు కడప కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వైసీపీ నాయకులను మాత్రమే బైండవర్ చేస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడినవారు, రౌడీషీటర్లు తదితరులను ఇరుపార్టీలకు చెందిన వారిని పిలిచి బైండవర్ చేయడం ఆనవాయితీగా ఉందన్నారు.అయితే ప్రస్తుతం కొంతమంది వైసీపీ నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు అధికారుల తీరుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరించే అధికారులను తప్పించి, నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని కోరారు. ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు