సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ గాయిని ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈమె జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘జెర్సీ’ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. ఇందులో సుబ్బలక్ష్మిపాత్రను ఎవరు పోషిస్తారనే విషయం మాత్రం ఇంతకాలం స్పష్టత రాలేదు. తాజాగా ఈ పాత్రకోసం ఓ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర కోసం సాయిపల్లవి, రుక్మిణి వసంత్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరిని కాదని మరో స్టార్ హీరోయిన్‌ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ హీరోయిన్ మరోవరోకాదు నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ విషయాన్ని ఎంఎస్ సుబ్బలక్షి జయంతి(సెప్టెంబర్ 16) సందర్భంగా అధికారికంగా చిత్రబృందం ప్రకటించనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్, తదితర విషయాలూ అదే రోజు ప్రకటించే అవకాశముంది. ఇకవేళ ఇదే జరిగితే ఛాలెంజే.. సుబ్బలక్ష్మి పాత్ర రష్మికకు ఎంతో ప్రత్యేకమైనదే కాకుండా పెద్ద సవాలుగా మారనుంది. ఆమె ప్రశాంతమైన స్వభావం, వ్యక్తిత్వం, హావభావాలు, తెరపై కనిపించే గాంభీర్యాన్ని రష్మిక తన నటనలో చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ ఇదే జరిగితే ఈ పాత్రను ఆమె ఎలా ఆవిష్కరిస్తుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చదవండి: రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..? నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) Viral: రన్నింగ్ RTC బస్సు డ్రైవర్ కు గుండెపోటు రెండున్నర లక్షల శవాల సమాధి.. చైనా దాచిన జలప్రళయం