Kaizer News

సింగరేణి కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో జీఎస్సార్‌

సింగరేణి కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో జీఎస్సార్‌ గళం

· State - Telangana · prabhanews.com

కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : సింగరేణి కార్మికులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, భూ నిర్వాసితుల సమస్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం శాసనసభలో ప్రస్తావించారు. సింగరేణి కార్మికులకు ఏరియా ఆసుపత్రుల్లోనే వైద్య మండలి పరీక్షలు నిర్వహించి, అన్ఫిట్‌ విధానాన్ని ప్రతినెలా అమలు చేయాలని కోరారు. అధికారులతో సమానంగా కార్మికులకు అలవెన్సులు, ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్‌ కార్మికులకు వైద్య సహాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని కోరారు. అర్హులైన కార్మిక కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలని, సర్వీస్‌ రికార్డుల్లో పేర్ల వ్యత్యాసాలు, వారసత్వ వివాదాలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. కొత్త కార్మిక చట్టాలతో కార్మికుల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణిలో పనిచేస్తున్న 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చేల్పూర్‌ భూ నిర్వాసితులకు పెండింగ్‌ పరిహారం చెల్లించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

Original source: prabhanews.com
Read more on Kaizer News