Kaizer News

పిడుగుపాటుతో ఇద్దరు రైతుల దుర్మరణం

పిడుగుపాటుతో ఇద్దరు రైతుల దుర్మరణం

· State - Telangana · ntnews.com

ఖమ్మం జిల్లాలో ఘటన వేంసూరు, సెప్టెంబర్‌ 19 : వ్యవసాయ పనులకు వెళ్లి న ఇద్దరు రైతులు పి డుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయి న ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. వేంసూరు మండలం లచ్చన్నగూడెంకు చెందిన పర్సా ఆనందరావు (52) దుక్కిదున్నేందుకు పొలానికి వెళ్లిన సమయంలో పిడుగుపడింది. కుటుంబసభ్యులు సత్తుపల్లి దవాఖానకు తరలించగా మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆనందరావుకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన వ్యవసాయ కూలీ నల్లగట్ల జమాయమ్మ (50) పొలంలో కలుపు తీస్తున్న క్రమంలో పిడుగుపడటంతో స్పృహ కోల్పోయింది. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News