Kaizer News

పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే నేడే లాస్ట్ డేట్..

పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే నేడే లాస్ట్ డేట్.. సువర్ణావకాశం మిస్ చేసుకోకండి!

· State - Telangana · telugu.oneindia.com

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు చేయూత పించన్ పథకాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అర్హులైన, ఇప్పటికీ పెన్షన్ తీసుకోని వారికి కూడా దరఖాస్తు చేసుకునే సువర్ణావకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజల నుండి చేయూత పెన్షన్ పథకానికి అభూతపూర్వమైన స్పందన లభించింది. కొత్త పెన్షన్ల కోసం ఇచ్చిన దరఖాస్తుల సంఖ్య 4.34 లక్షలకు చేరుకుంది. ఈ భారీ సంఖ్యను చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా 2.50లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు తదితరులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇక దరఖాస్తులకు నేడు తుది తేదీ కాగా, ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వారు ఉంటే ఆ దరఖాస్తులను పరిశీలించనున్నారు. మంగళవారం నుంచి ఈ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం ఇప్పుడు మంగళవారం నుంచి ఈ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ప్ అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేపడతారు. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రాలు తదితరాలను పరిశీలిస్తారు. అర్హతలు కలిగిన వారినే ఎంపిక చేసి పెన్షన్ మంజూరు చేస్తారు. ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల్లో అనర్హులు, మృతుల పేర్లను తొలగించి ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటించి పెన్షన్లు పంపిణీ చేస్తారు. నెలకు రూ.4 వేలు చొప్పున వారికి పెన్షన్ లు అందించనున్నారు. దివ్యాంగులకు అధిక మొత్తం అందుతుంది. అయితే పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అర్హుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న కారణంగా అధికారులు పరిశీలన తర్వాత ఎవరికి ఇవ్వాలి అనేది నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా పేద, నిస్సహాయులకు ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖవాసులకు సముద్ర తీర చేపలపై కొత్త హెచ్చరిక! నేడే లాస్ట్ డేట్... అలెర్ట్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరిశీలన సజావుగా జరిగితే త్వరలోనే కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు చేరతాయి. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేడే తుది గడువు కావటంతో అధికారులు అలెర్ట్ అంటున్నారు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News