Kaizer News

Ibrahimpatnam: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో గుర్

Ibrahimpatnam: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మొండెం లభ్యం

· State - Telangana · hmtvlive.com

Shorts ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం, తల, కాళ్లు, చేతులు తొలగింపు. దారుణ హత్యగా అనుమానం. ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్ లో లభ్యమైన మృతదేహం. ఎక్కడో హత్యకు గురైన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్ లో ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీటీపీఎస్ స్టేజ్ - 2 పంపు హౌస్ వద్ద మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం ప్రకారం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కూలింగ్ కెనాల్ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. సుమారు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళగా గుర్తించారు. మృతదేహానికి తల, చేతులు, కాళ్లు తొలగించి ఉన్నాయి. బ్లూ రంగు టాప్ ధరించగా ఎస్టీఆర్ఈ ఈ అనే ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. నలుపు రంగు బ్రా, తెలుపు రంగు లెగ్గిన్ ధరించి ఉంది. ఎవరో ఆ మహిళ తల, కాళ్లు, చేతులు నరికి దారుణంగా హత్య చేసి కూలింగ్ కెనాల్ లో పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News