Kaizer News

DC Movie OTT : రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యా

DC Movie OTT : రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

· Entertainment · telugu.abplive.com

ఖైదీ, విక్రమ్, లియో, కూలీ, విక్రమ్ మూవీస్‌తో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా సూపర్ క్రేజ్ అందుకున్నారు లోకేష్ కనగరాజ్. ఆయన హీరోగా ఎంట్రీ ఫస్ట్ యాక్షన్ డ్రామా 'DC'. ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 'DC' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (Sunnxt) సొంతం చేసుకోగా... సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అలాగే, 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లోనూ అదే రోజున స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో టాక్. ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా... లోకేష్ కనగరాజ్ సరసన వామికా గబ్బీ హీరోయిన్‌గా నటించారు. అలాగే, సంజయ్ కృష్ణమూర్తి, అవినాష్ రఘుదేవన్, గురు సోమసుందరం తదితరులు కీలకపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. .. స్పెషల్ రోల్‌లో సిద్ధు జొన్నలగడ్డ బాల్యంలో తల్లిని కోల్పోయిన దేవదాస్ (లోకేష్ కనగరాజ్) క్రిమినల్‌గా మారతాడు. అలా ఓ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా మారతాడు. ఆయుధాలతో వెళ్తున్న ప్రభుత్వ వాహనాన్ని అడ్డగించి వాటిని దోచుకుంటుంది దేవదాస్ అండ్ గ్యాంగ్. ఆ తుపాకులతోనే ఓ ఎస్సైని కాల్చి చంపేస్తుంది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తారు. దీంతో దేవదాస్ గ్యాంగ్ తప్పించుకుని ఓ లాడ్జిలో తలదాచుకుంటుంది. అక్కడి బార్‌లో పాటలు పాడే అమ్మాయి పార్వతి (సంజనా కృష్ణమూర్తి)తో దేవదాస్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. సరిగ్గా అప్పుడే పోలీసులు బార్‌పై దాడి చేస్తారు. ఈ కాల్పుల్లో పార్వతి చనిపోతుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న దేవదాస్ తన గురించి చెప్పిన వారి ఆచూకీ చెప్పిన వారిని హత్య చేసేందుకు ఓ లాడ్జికి వెళ్తాడు. అక్కడ వేశ్యా వాటికలో చిక్కుకుపోయిన చంద్రిక (వామికా గబ్బీ)ని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవదాస్ గ్యాంగ్ స్టర్‌గా ఎందుకు మారాడు? చంద్రికను కలిసిన తర్వాత అతని ప్రయాణం ఎలా సాగింది? పోలీస్ ఆఫీసర్‌ను దేవదాస్ ఎందుకు చంపాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. , గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next నువ్వులేక నేను లేను: రాధను చంపడానికి పథకం వేసిన విక్కీ, సుందరి...పై నుంచి రాధ తలపై పూలకుండీ పడేసిన భర్త విక్రమ్‌ హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి

Original source: telugu.abplive.com
Read more on Kaizer News