జ్యోతిష్య శాస్త్రంలో 2026 సెప్టెంబర్ నెలలో మాసంలో ముఖ్య గ్రహాల కదలికల కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సెప్టెంబర్ 1 వ తేదీన ఉదయం 3.39 గంటలకు బుధుడు ..కుజుడు ఒకే రాశిలో సంచారం జరగబోతుంది.ఈ రెండు గ్రహాలు మీన రాశిలో సంచరించడం వలన త్రి ఏకాదశ, లాభ-దృష్టి రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం వలన నాలుగు వారికి రాజయోగంతో పాటు డబ్బు వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . . మేష రాశి : లాభ దృష్టి రాజయోగం వలన ఈ రాశి వారికి స్వర్ణయుగంప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి.ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మిథున రాశి: రెండు కీలక గ్రహాలైన బుధుడు.. కుజుడు ఒకే రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి లాభాల పంట పండుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం కావడంతో మనశ్శాంతి లభిస్తుంది. కేరీర్ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్ వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. . కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది. అనుకోకుండా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. సింహ రాశి: లాభ దృష్టి రాజయోగం వలన ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలుంటాయి.సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుధుడు.. కుజుడు కలిసి సంచారం చేయడం వలన ఈ రాశి వారు విశేష ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొత్త తరహా ఆలోచనలను అమలు పరచడంతో మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలొస్తాయి. మీరు అందరికంటే విభిన్నంగా పని చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కలసి వస్తాయి. కెరీర్ పరంగా ప్రశంసలు లభిస్తాయి.జాబ్మారాలనుకునే వారికి చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు. వృత్తిలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి కీలక నిర్ణయం సరైన దిశలో సాగుతుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైందని పండితులు చెబుతున్నారు. తులా రాశి : లాభ దృష్టి రాజయోగం వలన ఈ రాశి వారు సా