Shorts అల్లూరి జిల్లా: అల్లూరి ఏజెన్సీలో సమయానికి వర్షాలు లేక రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తక బీడు బారిన భూములతో గిరి రైతులు నష్టాలపాలు కావడంతో పంట పొలాలు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నంలో భాగంగా పాడేరు శాసనసభ్యులు వైయస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు నష్టపోయిన గిరి రైతుల పంట పొలాల్లో పర్యటించి పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు పరామర్శించి రైతులు కష్టాలు తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులు ఎమ్మెల్యే ముందు కన్నీరు పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా సమయానికి వర్షాలు పడక వరి మరియు వాణిజ్య పంటలు కూడ ఇంత వరకు వేయక వేసిన పంటలు సరిగా రాక కరువుతో గిరి రైతులు లబోదిబోమంటుంటే కనీసం ప్రభుత్వం సర్వే కూడా చేయించకపోవడం దారుణం అని ప్రభుత్వంపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. తక్షణమే అల్లూరి వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కరువుపై సమగ్ర సర్వే నిర్వహించి పంటలకు నష్టపరిహారంతో పాటు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి గిరిజన రైతులకు ఆదుకోవాలని పాడేరు ఎమ్మెల్యే విశ్వేస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సీధరి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్ కుమార్, ఐటీ వింగ్ సంయుక్త కార్యదర్శి కూడ సుబ్రమణ్యం, మాజీ సర్పంచ్ వనుగు బసవన్న దొరా, సిరగం దశమూర్తి, నాయకులు ముంచంగి రాజం నాయుడు, రామ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు