Kaizer News

సౌదీలో మోగిన హెచ్చరిక సైరన్లు

సౌదీలో మోగిన హెచ్చరిక సైరన్లు

· National - India · sakshi.com

దుబాయ్‌: శత్రువు నుంచి వైమానిక దాడి జరిగే ప్రమాదముందంటూ ప్రజలను హెచ్చరిస్తూ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సౌదీ అరేబియా వ్యాప్తంగా సైరన్లు మోగాయి. హౌతీల దాడులు మొదలైన తర్వాత రాజధాని రియాద్‌లో ఇలాంటి సైరన్లు మోగడం ఇదే మొదటిసారి. రియాద్‌ విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించిందని, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వార్తలు వచ్చాయి. అయితే, ఎవరూ మరణించలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుళ్లకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌ పొరుగుదేశాలకు హెచ్చరికలు చేయడం, దాడులకు పాల్పడటాన్ని శుక్రవారం ఐరాస భద్రతామండలి ఖండించింది. ఇలాంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతకు, అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర విఘాతం కల్గిస్తాయని పేర్కొంది. హౌతీలకు సైనికపరమైన ఎలాంటి సాయం అందకుండా చేసేందుకు సంబంధిత దేశాల మధ్య ఆచరణాత్మక సహకారం అవసరమని పేర్కొంది. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News