Kaizer News

Devarakadra: దేవరకద్రలో గణనాథులకు జి. భాస్కర్ రెడ్

Devarakadra: దేవరకద్రలో గణనాథులకు జి. భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts దేవరకద్ర: దేవరకద్ర మున్సిపాలిటీ పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోదరుడు జి. భాస్కర్ రెడ్డి సందర్శించి గణనాథుల దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథునికి పుష్పాలు, పత్రి సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణపతి ఆశీస్సులతో దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు, యువతతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ఉత్సవాల నిర్వహణపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేవరకద్ర పట్టణంలోని 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాయపడిన విషయం తెలుసుకున్న జి. భాస్కర్ రెడ్డి ఆయనను పరామర్శించి, వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి కొండ దమయంతి గోవర్ధన్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యుగేందర్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు గోపి మాధవి, దొబ్బలి అంజలి, కాంగ్రెస్ నాయకుడు చెన్నప్ప, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు, యువత తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News