Shorts Rudrur: అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నిరుపేదలకు సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 486 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పుడు నిర్మించిన 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు మాత్రమే కేటాయించాలని అన్నారు. ఇందులో కూడా అసలైన నిరుపేదలను గుర్తించి గ్రామసభ ఏర్పాటు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు అయిన తరువాత మిగతా అర్హులు ఎవరైతే ఉంటారో వారికీ కూడా తహసీల్దార్ ఇంటి నిర్మాణం కొరకు ఖాళీ స్థలాన్ని చూయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్ సాయిలు, కన్నె ప్రవీణ్, సిరిగిరి శేఖర్, బొట్టె గజేందర్, కొత్తపల్లి రవి కిరణ్, మతీన్, పార్వతి ప్రవీణ్, అల్లా ఉద్దీన్, వంజరి గోపి, శానం పోశెట్టి, సాయికిరణ్, సాయి తేజ, చాంద్ పాషా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు