Kaizer News

‘వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు’ పుస్తక రజతోత్సవ స

‘వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు’ పుస్తక రజతోత్సవ సభ 20న

· State - Telangana · ntnews.com

రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ వెల్లడి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్‌లోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న ‘వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు’ పుస్తక రజతోత్సవ సభ కొనసాగుతుందని ఆ పుస్తక సంపాదకులు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ వెల్లడించారు. తెలంగాణ లోని 33 జిల్లాల నుంచి కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సామా జిక ఉద్యమకారులు హాజరయ్యే ఈ సభలో పాతికేండ్ల బీసీ సాహిత్య ప్రయాణాన్ని సమీక్షిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ కవులు, రచయితలు భవిష్యత్తు కర్తవ్యాలను పది వాక్యాల్లో రాసి సభకు సమర్పించాలని, అదే రేపటి బీసీ సాహిత్య ప్రకటన (బీసీ లిటరరీ డిక్లరేషన్‌)గా నిలిచిపోతుందని పేర్కొన్నారు. చర్ల/గోవిందరావుపేట, సెప్టెంబర్‌ 18 : బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన రైతు 2025 ఆగస్టులో మృతిచెందాడు. ఆ రైతు పేరున ఉన్న భూమిని తన పేరు మీదికి మార్పిడి చేయాలని గత మే నెలలో ఆయన కూతురు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నది. తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌ శుక్రవారం తన కార్యాలయంలో సదరు మహిళా రైతు నుంచి రూ.14 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ హాస్టల్‌ వార్డెన్‌ భూక్యా వాల్‌సింహ కుక్‌కు జీతం బిల్లు చేసేందుకు శుక్రవారం రూ.14 వేలు తీసుకుంటుండగా వార్డెన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వినాయక్‌నగర్‌, సెప్టెంబర్‌ 18: ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో చోటుచేసుకున్నది. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌ సతీశ్‌(41) నైట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు ముగించు కున్న తర్వాత శుక్రవారం ఉదయం తుపాకీని శుభ్రం చేసే సమయంలో ప్రమా దవశాత్తు మిస్‌ఫైర్‌ కావడంతో మృతిచెందాడు. సీపీ సాయిచైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు

Original source: ntnews.com
Read more on Kaizer News