సత్యప్రసాద్ మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని 2024 ఆగస్టు 18న మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ వై.ప్రభాకర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుని దొరికిపోయిన దొంగల కుట్ర ఇది డీఎస్సీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మద్యం అక్రమ కేసులో కొత్త నాటకం సత్యప్రసాద్ సీఎంను దగ్గర నుంచైనా చూసి ఉంటాడా? రేపు ఓ హోంగార్డును తెచ్చి సీఎంపై ఆరోపణలు చేయిస్తే చెల్లుతుందా? విజయవాడ సీపీతో సత్యప్రసాద్ సంబంధాల వెనక మర్మమేమిటి? ఆస్తులు అమ్మించి.. అన్నీ తాము చూసుకుంటామని భరోసా దేనికి..? మానసిక వైకల్యానికి చికిత్స తీసుకుంటున్న సత్యప్రసాద్ సాక్ష్యం చెల్లుతుందా? ఆది నుంచీ వేధింపులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులే సిట్ ఆయుధాలు బాబుకు అవసరమైనప్పుడు.. ఆయన చెప్పినట్టు అబద్ధపు సాక్ష్యాలు సుప్రీంకోర్టు తలంటినా సిట్ తీరులో కానరాని మార్పు అసలు మద్యం దోపిడీ జరిగింది 2014–19 మధ్య బాబు హయాంలో.. మళ్లీ ఇప్పుడు మద్యం మాఫియా చెలరేగిపోతోంది.. అధికరేట్లు.. పర్మిట్ రూమ్‌లు.. ఆక్షన్ లేకుండా కేటాయింపులు ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలన్నీ చంద్రబాబు డైరెక్షన్‌లోనే వీటి నుంచి డైవర్ట్ చేయడానికే సిట్ కట్టుకథలు.. సాక్షి, అమరావతి: నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ స్టోరీలు సీజన్‌లవారీగా విడుదలైనట్లు నారావారి భేతాళ కుట్ర కేసులో నాలుగో సీజన్ మొదలయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మద్యం అక్రమ కేసు నాటకాన్ని నానా ప్రయాసలు పడి రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తోంది. అయినా అతకని కథలు, పొసగని పాత్రల వల్ల ఈ కుట్రల నాటకం రసాభాస అవుతోంది. కుట్రలు, బెదిరింపులు, ప్రలోభాలతో సాగుతున్న దర్యాప్తు తీరును ప్రజలు గమనిస్తున్నారు. రెండేళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా అధోగతి పాలయ్యింది. ప్రజా సమస్యల నుంచి, పాలనా వైఫల్యాల నుంచి, డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్న తీరు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి సిట్ చేత మళ్లీ భేతాళ కుట్ర కేసులో కొత్త కథలు మొదలుపెట్టారు. తాము చెప్పిన వారికి వ్యతిరేకంగా, తమకు కావలసిన విధంగా వాంగ్మూలాలు ఇవ్వని వారిని రకరకాల మార్గాల్లో తమ దార్లోకి తెచ్చుకోవడం, వారి చేత బలవంతంగా కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించడం జనం చూస్తున్నారు. అలా తమ దార్లోకి తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) అప్పటి ప్రత్యేకాధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ను ఈ సీజన్‌లో రంగంలోకి దింపారు. అక్రమ మద్యం కేసులో సత్యప్రసాద్ చేత విజయవాడ ఏసీబీ కోర్టు ముందు శుక్రవారం తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. సిట్ ముందే సిద్ధం చేసి ఇచ్చిన స్క్రిప్‌్టలోని తప్పుడు వివరాలనే సత్యప్రసాద్ కోర్టు ముందు వల్లెవేశారు. రెండున్నర ఏళ్లుగా ఈ కేసులో ఏమీ కనుక్కోలేకపోయారంటూ సిట్‌పై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. సిట్ అతి చేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ముందు సిట్ తీరును తేలుస్తామంది. దీనిని బట్టే సిట్ దర్యాప్తులో ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత నిష్పాక్షికత, పారదర్శకత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు సీఎంను చూసి ఉంటాడా..? సత్యప్రసాద్ అనే వ్యక్తి