Kaizer News

Mulugu: AR రూఫింగ్ ఇండస్ట్రీని ప్రారంభించిన మున్సి

Mulugu: AR రూఫింగ్ ఇండస్ట్రీని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్, సూర్య!

· State - Telangana · hmtvlive.com

Mulugu: ములుగుజిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ ఫంక్షన పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన AR Roofing Industryని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుంజ సూర్య తో కలిసి ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ చంద్రకళ మాట్లాడుతూ ములుగు పట్టణంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరమైన విషయం. పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, పట్టణ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపల్ కౌన్సిలర్లు గుంటోజు పావని నిరంజన్ చారి, కేశెట్టి నవీన్,కుతుబుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఈర్సవడ్ల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి,మండల పార్టీ అధ్యక్షులు ముష్నేపల్లి కుమార్ గౌడ్, పట్టణ అధ్యక్షులు లావుడ్య రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రియాజ్ మీర్జా, నల్లెల భరత్, గుగ్గిళ్ళ సుజన్, హాజీ పాషా, గందె రాజు బొంతల వేణు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News