Kaizer News

సీఐ నాగరాజుకు ఉరిశిక్ష తప్పదా? కేరళ ఉదయకుమార్ కేసు

సీఐ నాగరాజుకు ఉరిశిక్ష తప్పదా? కేరళ ఉదయకుమార్ కేసులో ఏం జరిగింది?

· State - Telangana · telugu.oneindia.com

న్యాయాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణమే ఒక మృత్యువుగా మారిపోతుంది. రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే కాలయముళ్లై విరుచుకుపడితే, ఆ నరకయాతన వర్ణించనలవి కానిది. ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతం మానవత్వానికే పెద్ద మచ్చగా నిలిచింది. కస్టడీలో విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టి చంపేయడమే కాకుండా, ఆ శవాన్ని అర్ధరాత్రి వేళ బైక్‌పై శ్మశానానికి తరలించి కాల్చేయడం.. పోలీసుల పైశాచికత్వానికి, నేరపూరిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. కస్టోడియల్ టార్చర్ అనేది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరుడికి ప్రసాదించిన "జీవించే హక్కు"పై జరిగిన దాడి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తరహా కస్టడీ హత్యలు, బాధ్యులైన అధికారులకు న్యాయస్థానాలు విధించిన ఉరిశిక్షల వరకు చట్టం ముందు ఎవరూ అతీతులు కారనే నిజాలు స్పష్టమవుతున్నాయి. రాత్రికి రాత్రే సాక్ష్యాల దహనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికర కోణాలు! కృష్ణలంక కస్టోడియల్ డెత్ కేసులో సిట్ (SIT) అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు విస్తుపోయేలా చేస్తోంది. ఈ ఏడాది మే 7న కృష్ణలంక స్టేషన్‌లో సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలతో కలిసి సాయికృష్ణను నిర్బంధించి దారుణంగా కొట్టారు. మే 12 నాటికి సాయికృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. విషయం బయటకు పొక్కితే ప్రమాదమని భావించిన పోలీసులు, అతడిని రాణిగారితోటలోని ఒక ఖాళీ బిల్డింగ్ కు తీసుకెళ్లారు. కాసేపటికే సాయికృష్ణ ప్రాణాలు విడిచాడు. సాయికృష్ణ చనిపోయాడని తెలియగానే సీఐ నాగరాజు ఆదేశాలతో అర్ధరాత్రి 12:30 గంటలకు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, బైక్‌పై 'స్వర్గపురి' శ్మశానవాటికకు తీసుకెళ్లి 16వ నంబరు సిమెంట్ ప్లాట్‌ఫామ్‌పై తగలబెట్టారు. ఆ తర్వాత డిజిటల్ సాక్ష్యాలు, ఫోటోలను డిలీట్ చేసి, మృతుడి కుటుంబాన్ని బెదిరిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని రాయబారాలు నడిపారు. తిరువనంతపురంలో దొంగతనం అనుమానంతో అదుపులోకి తీసుకున్న 21 ఏళ్ల ఉదయకుమార్‌ను ప్రైవేట్ పార్టులు, తొడలు, వీపు మీద ఐరన్ రాడ్లతో కొట్టారు. విచారణలో పెట్టిన నరకయాతన వల్ల రక్తనాళాలు పగిలి, అదే రోజు రాత్రి ఆసుపత్రికి తరలించేసరికే ఉదయకుమార్ మృతి చెందాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఉదయకుమార్ తల్లి ప్రభావతి.. కొడుకు న్యాయం కోసం సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. ఆమె పిటిషన్ ఆధారంగానే కేసు సీబీఐ (CBI)కి బదిలీ అయింది. సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!! 2018 జూలై 25న తిరువనంతపురం సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును "అత్యంత అరుదైనది" గా పేర్కొంది. నిందితులైన ఎస్సై కె. జితకుమార్, కానిస్టేబుల్ ఎస్.వి. శ్రీకుమార్‌లకు ఉరిశిక్ష విధించింది. లాకప్ డెత్ కేసులో పోలీసులకు ఉరిశిక్ష పడటం దేశంలో సంచలనం సృష్టించింది. కుట్ర పన్ని, సాక్ష్యాలను ధ్వంసం చేసిన మిగతా ముగ్గురు పోలీసు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును పోలీసులు ఆశ్రయించగా.. సీబీఐ దర్యాప్తులో అనేక

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News