Kaizer News

Visakhapatnam: మధురవాడ జోన్‌లో రూ.7 కోట్లతో అభివృద

Visakhapatnam: మధురవాడ జోన్‌లో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గంటా

· State - Telangana · hmtvlive.com

Shorts విశాఖపట్నం: మధురవాడ జోన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం శంకుస్థాపన.. ప్రారంభోత్సవాలు చేశారు. 7 వ వార్డు పరిధిలోని పాత పీఎం పాలెం, భరత్ నగర్, మల్లయ్య పాలెం, వాంబే కాలనీ, ఎన్.జి.ఓ. కాలనీ, చంద్రంపాలెం ప్రాంతాల్లో రూ. 6.10 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రెయిన్లు, ప్రహరీలు.. 5 వ వార్డు పరదేశిపాలెంలో రూ.20 లక్షలతో డ్రెయిన్, కల్వర్టు నిర్మిస్తున్నామని వివరించారు. 5 వ వార్డు సాయిరాం కాలనీలో రూ. 88 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధురవాడ జోన్ లో రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు చేపట్టామని.. రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు వంటి మౌలిక సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. జోన్ లో 25 వేల ఇళ్లకు నిరంతర తాగు నీటి సరఫరా కోసం రూ. 725 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. జోనల్ కమిషనర్ వి.అయ్యప్ప నాయుడు, ఎస్.ఈ. శాంతి రాజు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, నాగోతి సత్యనారాయణ, మన్యాల సోంబాబు, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, కానూరు అచ్యుతరావు, మొల్లి హేమలత, గరే గుర్నాథ్, లొడగల జానకిరామ్, పోలిశెట్టి నాగేశ్వరరావు, గడ్డి శ్రీను, నాగోతి వెంకట్రావు, నాయుడు, పోతిన శివ, బోయి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వినాయకుని దర్శించుకున్న గంటా చంద్రంపాలెంలో ఏర్పాటు చేసిన 45 అడుగుల వినాయక విగ్రహాన్ని గంటా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News