భారత క్రికెట్ జట్టు మాజీ సారథి రోహిత్ శర్మ భవిష్యత్తు చుట్టూ నడిచిన వివాదం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఏర్పడిన తీవ్ర విబేధాలు అజిత్ అగార్కర్ పదవి కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా మారాయి. 2027 వన్డే ప్రపంచకప్‌నకు ముందే చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో బీసీసీఐ బంధం తెగిపోయింది. ఇంగ్లాండ్ పర్యటన పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముంబైలో జరిగిన కీలక రివ్యూ సమావేశానికి అగార్కర్ కనీసం వర్చువల్‌గా కూడా హాజరుకాకపోవడం బోర్డు పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సౌతాఫ్రికాలో జరిగే 2027 ప్రపంచకప్ వరకు కొనసాగాలని అగార్కర్ భావించినా, కొత్త వ్యక్తిని నియమించాలనే సంకేతాలను బోర్డు గత నెల రోజులుగా ఇస్తూ వచ్చింది. గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనళ్లకు చేరి, మూడు ట్రోఫీలు గెలిచిన జట్టును ఎంపిక చేసిన కమిటీ సారథిని బోర్డు ఇంత ఆకస్మికంగా తప్పించడం సంచలనంగా మారింది. Read Also: Asian Games Mess: జపాన్ బయల్దేరే ముందు క్రికెటర్లకు జెర్సీ కష్టాలు.. సరిపోని కిట్స్, ఇరుకైన గదులతో ఇబ్బందులు.. రంగంలోకి బీసీసీఐ రోహిత్ పై వేటు నిర్ణయం.. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ శర్మను పక్కన పెట్టాలని అగార్కర్ ప్యానెల్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రోహిత్‌కు తెలియజేసే బాధ్యతను అతడి ప్రాణస్నేహితుడు, సౌత్ జోన్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాకు అప్పగించారు. అయితే 2027 వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్న రోహిత్ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బోర్డులోని ఒక శక్తివంతమైన ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రోహిత్‌కు మద్దతుగా, అతడి రిటైర్మెంట్ వార్తలను ఖండిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అగార్కర్‌కు తెలియకుండానే ఈ ప్రకటన రావడంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. యశస్వి జైస్వాల్‌కు కనీసం 20 వన్డేలు ఆడే అవకాశం ఇస్తేనే ప్రపంచకప్‌కు సిద్ధమవుతాడని అగార్కర్ వాదించాడు. కానీ భారత క్రికెట్‌లో మెగాస్టార్ల రిటైర్మెంట్ వ్యవహారాలు సెలెక్టర్ల చేతుల్లో కాకుండా బోర్డు పెద్దల నియంత్రణలోనే ఉంటాయనే వాస్తవాన్ని అగార్కర్ జీర్ణించుకోలేకపోయాడు. Read Also: IND VS BAN, Asian Games Semifinal: బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు వీవీఎస్ తో పాలసీ వార్.. ఏషియన్ గేమ్స్ వివాదం సహచర మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌తోనూ గాయపడిన ప్లేయర్ల పాలసీ, ఇండియా-ఏ షెడ్యూల్ విషయంలో అగార్కర్‌కు తీవ్ర విభేదాలు వచ్చాయి. ఏ పోటీ అయినా అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దించాలని లక్ష్మణ్ పట్టుబట్టగా, టైర్-2 ఈవెంట్ అయిన ఆసియా క్రీడలకు ప్రధాన ఆటగాళ్లను పంపడం ఎందుకని అగార్కర్ ప్రశ్నించాడు. దీంతో వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్లను ఎంపిక చేయలేకపోయారు. సీవోఈ వైఫల్యాలపై లక్ష్మణ్ అసంతృప్తి.. ఇండియా-ఏ మ్యాచ్‌లు, డొమెస్టిక్ టోర్నీల క్లాష్ కావడం, గాయపడిన ఆటగాళ్ల రికవరీ టైమ్‌లైన్స్ నిర్దిష్టంగా లేకపోవడం అగార్కర్, లక్ష్మణ్ మధ్య మరింత దూరాన్ని పెంచాయి. ఆటగా