Kaizer News

బీఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సాయం

బీఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సాయం

· State - Telangana · ntnews.com

చండూరు, ఆగస్టు 29 : చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కురుపాటి శ్రీను మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న గుండ్రపల్లి గ్రామ సర్పంచ్ ఉజ్జిని ఉషా అనిల్ రావు, బీఆర్ఎస్ పార్టీ చండూరు మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్నతో కలిసి శనివారం శ్రీ‌ను కుటుంబాన్ని పరామర్శించి రూ.10,000/- ఆర్ధిక సహాయం అందజేశారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ టేకుల వినోద్ రెడ్డి, వార్డు మెంబర్లు తీగల వెంకన్న, వడ్డమల్ల మధు, పెండ్యాల ఉపేందర్, దామెర అనిల్, కురుపాటి రాజు, కురుపాటి సాయిలు, కురుపాటి కృష్ణ, నక్క కృష్ణయ్య, క్రాంతి, నవీన్, కొమ్మనపల్లి శ్రీను, భూతరాజు శంకర్ పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News