టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సెంట్రల్ జోన్‌తో ఇవాళ మొదలైన తొలి సెమీఫైనల్లో వైభవ్ ఈస్ట్ జోన్ తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో గాయపడటంతో వైభవ్‌కు ఈ అవకాశం వచ్చింది. సీనియర్ జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో వైభవ్ చిరునవ్వుతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ లాంటి సీనియర్ బౌలర్లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వారితో అతడు ఎలా వ్యవహరిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైభవ్‌కు ఇది కేవలం రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్. ఓవరాల్‌గా 10వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే. ఇంత తక్కువ అనుభవంలో షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్‌ను వైభవ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్‌కు త్రిపుర పేసర్ అభిజిత్ సర్కార్ శుభారంభం అందించాడు. అమన్ మొఖాడే (8), కునాల్ చందేలా (6)లను ఆదిలోనే ఔట్ చేశాడు. కొద్ది సేపటికే ముకేశ్ కుమార్ సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ (12)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో సెంట్రల్ జోన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 81-3గా ఉంది. ఆర్యన్ జుయల్ (42), యశ్ రాథోడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్ షూటింగ్ కోసం ఓనం మిస్.. ర్యాండమ్ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) 2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు