ముంబై: యజమాని అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసినంత మాత్రాన ఉద్యోగిని బలవంతంగా రిటైర్ చేయించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) రిటైర్మెంట్ ఆదేశాలను కొట్టివేసింది. అనుమతి లేకుండా పూర్వ విద్యార్థుల కోసం ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పా టు చేశాడని టిస్ ప్రొఫెసర్ డాక్టర్ స్వపన్ గారెన్‌ను బలవంతంగా పదవీవిరమణ చేయాలని ఆదేశించడం వక్రబుద్ధి అని జస్టిస్ ఎం.ఎస్. కారి్ణక్, జస్టిస్ సందేశ్ పాటిల్‌లతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. టిస్ పూర్వ విద్యార్థులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయడం.. ప్లేస్‌మెంట్ సరీ్వసుల కోసం దాన్ని ఉపయోగించడం అన్న ఒకే ఒక్క ఆరోపణ డాక్టర్ స్వపన్‌పై ఉందని, ఇందుకు సంస్థ విధించిన శిక్ష స్థాయికి మించిందని బెంచ్ తెలిపింది. ప్లేస్‌మెంట్ సరీ్వసుల కోసం ఆ ప్రొఫె సర్ డబ్బులు వసూలు చేశారు అనేందుకు ఎలాంటి సూచన కూడా లేదని స్పష్టం చేసింది. పూర్వ విద్యార్థులు ఉపయోగపడే సమాచారాన్ని పంచుకునేందుకు ఆ వాట్సాప్ గ్రూపు ఒక్కటే వేదికని, కేవలం సంస్థ అనుమతి తీసుకోలేదన్న కారణంతో బలవతంగా పదవీ విరమణ చేయించడం వంటి పెద్ద శిక్ష విధించడం సరికాదని తెలిపింది. డాక్టర్ స్వపన్ పేరు ప్రఖ్యాతులున్న అధ్యాపకులని, 1985 నుంచి టిస్‌లో పని చేస్తున్నారని హైకోర్టు గుర్తు చేసింది. పదవీ విరమణ చేయాలంటూ టిస్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ.. పదవీ విరమణ వయసు వరకూ చెల్లించాల్సిన జీతంలో సగం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.‘ఖీఐ జ్చీnటఇ్చట్ఛ్ఛట ఐఝp్చఛ్టి2’ పేరుతో డాక్టర్ స్వపన్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి లాభపడ్డారన్నది టిస్ ఆరోపణ. తిరుమల : సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో శ్రీమలయప్ప అభయం (ఫొటోలు) భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే