Kaizer News

Bhadradri: సారపాకలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట

Bhadradri: సారపాకలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన లారీ ఒకరు మృతి!

· State - Telangana · hmtvlive.com

Shorts Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐటీసీ గేట్ ఎదురుగా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో ఐటీసీ గేట్ సమీపంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News