Kaizer News

తారాపథంలో కాసుల వేట

తారాపథంలో కాసుల వేట

· Entertainment · sakshi.com

సినిమా స్టార్స్‌కి ఆదాయం ఎలా వస్తుంది? అంటే వెంటనే రెమ్యూనరేషన్‌ ద్వారా అని ఠక్కున చెప్పేసే రోజులు కావివి. యాడ్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్‌... అంటూ వరుసపెట్టి లెక్కించే రోజులు. ‘ఇందుగల దందు లేదను సందేహంబు వలదు ఎందెందు చూసినా అందందే కలదు’ అన్నట్టుగా తారలకు ఆదాయ మార్గాలు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలోనైతే కాదేదీ కాసుల వేటకు అనర్హం అన్నట్టుగా అది తారా స్థాయికి చేరుకుంది. వరుసగా ‘యాడ్‌’ చేసుకుంటూ... ఒకప్పుడు హీరో, హీరోయిన్‌కి సినిమా ఒప్పందం కుదిరితే అందులోనే పారితోషికం ప్రధానంగా ఉండేది. ఏడాదికి కొన్ని సినిమాలు.. వాటి ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌ను మాత్రమే ప్రధాన ఆదాయంగా భావించేవారు. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్స్‌ షారుక్‌ఖాన్, సల్మాన్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్, దీపికా పదుకోన్‌ వంటి వారు రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా సినిమాలు దాటి అడ్వర్టయిజ్‌మెంట్లలోకి తారలు రావడంతో సినిమాలకు ఆవల తారలకు ఆదాయం మొదలైంది. అక్కడ నుంచి ఒక్కొక్కటిగా ఆదాయ మార్గాలు పెరుగుతూ పోయాయి. ఈవెంట్‌... స్టార్‌ వెంటే... ‘‘ఐదేళ్ల పాటు ఒక సినిమాకు సైన్‌ చేయడం వల్ల అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈవెంట్లు నాకు బాగా ఉపయోగపడ్డాయి’’ అంటూ ఇటీవల ఒక టాలీవుడ్‌ నటి మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే... ఇప్పుడు స్టార్స్‌ జీవితంలో ఈవెంట్స్‌ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ మోస్తరు స్థాయి కలిగిన నటి/నటుడికైనా సరే షోరూమ్స్‌ ఓపెనింగ్స్‌ అనేవి రూ.లక్షల్లో ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక బాలీవుడ్‌ స్టార్స్‌ ఆలియా భట్‌ వంటి వారైతే రూ .3 కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారట. స్టార్‌... అంబాసిడర్‌... సాధారణ ప్రకటనలతో పాటు ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఒప్పందాలు కూడా తారలకు పెద్ద ఆదాయ మార్గంగా మారాయి. దుస్తులు, నగలు, వాచీలు, కార్లు, మొబైల్‌ ఫోన్లు, రియల్‌ ఎస్టేట్, ఫుడ్‌ బ్రాండ్లు.. ప్రతీ ఉత్పత్తీ స్టార్‌ ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని ఆరాటపడడం తారలకు పైసా వసూల్‌గా మారింది. కేవలం ప్రకటనలో నటించడం మాత్రమే కాదు. కంపెనీ కార్యక్రమానికి హాజరవడం, కొత్త షోరూమ్‌ ప్రారంభించడం, ఉత్పత్తిని సోషల్‌ మీడియాలో చూపించడం, బ్రాండ్‌ ఈవెంట్‌లో మాట్లాడటం... ఇలా ఒప్పందం ఆధారంగా అంబాసిడర్‌ సేవలకు తగ్గట్టుగా స్టార్స్‌కు పారితోషికం అందుతోంది. ఇది ఓ రకంగా ఏడాదికోసారి అందే జీతం లాంటిదని చెప్పోచ్చు. ఈ తరహా ఒప్పందాల కోసం బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ రూ. 15 కోట్ల వరకూ వసూలు చేస్తారని సమాచారం. హోస్ట్‌... ఆదాయానికి బెస్ట్‌... సినిమా కాకుండా టెలివిజన్, ఓటీటీ కూడా తారలకు మరో ఆదాయ వేదికగా అమరిపోయింది. కౌన్‌ బనేగా కరోర్‌ పతి అంటూ అమితాబ్‌ అరంగేట్రం చేయించిన స్టార్‌ ఆధారిత గేమ్‌ షోలు ఇప్పుడు స్టార్స్‌ని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. టాక్‌ షోలు, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, వెబ్‌ సిరీస్‌లకు హోస్టింగ్‌ చేయడం... ఒక్కో కార్యక్రమానికి వేర్వేరుగా ప్రత్యేక పారితోషికం అందుతోంది. ప్రస్తుతం అన్ని భాషల్లో హల్‌ చల్‌ చేస్తున్న బిగ్‌ బాస్‌ రియాల

Original source: sakshi.com
Read more on Kaizer News