Kaizer News

AP: అసెంబ్లీపై 250 మీటర్ల స్పియర్ టవర్‌కు సీఆర్డీఏ

AP: అసెంబ్లీపై 250 మీటర్ల స్పియర్ టవర్‌కు సీఆర్డీఏ ఆమోదం!

· State - Telangana · hmtvlive.com

Shorts AP: అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని పరిధితో పాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో రాజధాని ప్రాంతంలో పెరగనున్న జనాభా, ఉద్యోగ, వాణిజ్య కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సులభమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి, అసెంబ్లీ భవన నిర్మాణం, రైతులకు యాన్యుటీ, భూముల కేటాయింపు, పచ్చదనం, ప్రజా రవాణా వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. అమరావతిలో నిర్మించనున్న నూతన అసెంబ్లీ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్ నిర్మించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. స్పియర్‌తో పాటు లిఫ్ట్‌ల నిర్మాణానికి కలిపి రూ.661 కోట్ల వ్యయానికి అనుమతి ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికగా నిలిచే అసెంబ్లీ భవనం దేశంలోనే ప్రత్యేకమైన నిర్మాణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అసెంబ్లీ భవనంలో వ్యూపాయింట్ ఏర్పాటు చేసే అంశంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యేక ఆకర్షణగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. రాజధానిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లతో పాటు క్వాంటం టవర్స్, బిట్స్ పిలానీ వంటి భవనాలు కూడా ప్రత్యేక నిర్మాణాలుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రోడ్లు, ఇతర ప్రాథమిక మౌలిక వసతులు, పట్టణాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు. రాజధాని నిర్మాణంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తూనే భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. నగరం విస్తరించే కొద్దీ ప్రజలకు అవసరమయ్యే రవాణా, వాణిజ్య, నివాస, పర్యాటక సదుపాయాలకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అన్నారు. రెండో దశ భూ సమీకరణలో ఒక ఎకరా కంటే తక్కువ కమతం ఉన్న రైతులకు యాన్యుటీ చెల్లించే అంశానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. భూ సమీకరణ ప్రక్రియలో చిన్న కమతాలు కలిగిన రైతులకు కూడా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయంతో రెండో దశలో భూములు సమీకరణలో భాగమైన అర్హులైన చిన్న రైతులకు యాన్యుటీ చెల్లింపునకు మార్గం సుగమమైంది. రాజధానిలో అవసరమైన వాణిజ్య, విద్యా మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు హోటళ్లు, పాఠశాలలకు భూముల కేటాయింపుపై మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు సమావేశం ఆమోదం తెలిపింది. అమరావతి భవిష్యత్‌లో పరిపాలనా కేంద్రంగానే కాకుండా విద్య, పర్యాటకం, వాణిజ్య

Original source: hmtvlive.com
Read more on Kaizer News