Shorts Kukunoor: డా. బి.ఆర్. అంబేద్కర్‌ను కించపరిచేలా తప్పుడు ఆరోపణలతో కల్పిత పుస్తకం రూపొందించారనే ఆరోపణల నేపథ్యంలో హమారా ప్రసాద్ అరెస్టు కావడంపై కుక్కునూరు అంబేద్కర్ యువజన కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుక్కునూరు, కివ్వాకలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛలను గౌరవిస్తూ, చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా జరిగిన అరెస్టును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దార సంజీవరావు, మాచర్ల పోతురాజు, గంజి వెంకట్రావు, మాచర్ల సుధాకర్, బుడగల రవికుమార్, తెల్లమల్ల సంతోష్ కుమార్, రాయి రవికుమార్, పూల దాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు