Kaizer News

ఒక్క అణు పరీక్షతో 1,399 భూకంపాలు!

ఒక్క అణు పరీక్షతో 1,399 భూకంపాలు!

· National - India · ntnews.com

ఉత్తర కొరియాలో జరిగిన అధ్యయనం వెల్లడి ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తర కొరియాలో భూకంపాలపై జరిపిన అధ్యయనంలో చాలా భూకంపాలకు అణు పరీక్షలే కారణమని తేలింది. 2017లో ఆ దేశం తన చివరి అణు పరీక్ష జరిపిందని.. ఆ తర్వాత కూడా భూకంపాలు సంభవించాయని.. వాటిలో ప్రతిదీ ముందు దాని కంటే బలమైనదని వెల్లడించింది. మంటప్‌ పర్వతం కింద ఉత్తర కొరియా 2006-2017 మధ్య కాలంలో ఆరు అణు పరికరాలను పేల్చింది. అణు పరీక్షలు భూమిలో ప్రకంపనలు కలిగిస్తాయి. దక్షిణ కొరియాలోని పుసాన్‌ నేషనల్‌ యూనివర్సిటీ భూకంప శాస్త్రవేత్త క్వాంగ్‌-హి కిమ్‌ సైన్స్‌ అలర్ట్‌తో మాట్లాడుతూ పేలుడు జరిగిన వెంటనే అత్యంత తీవ్రంగా ఉండి ఆ తర్వాత క్షీణించడానికి బదులుగా భూ ప్రకంపనలు అనేక సంవత్సరాల పాటు పెరుగుతూ వచ్చాయని తెలిపారు. అక్టోబర్‌ 2006- 3 సెప్టెంబర్‌ 2017 మధ్య కాలంలో మంటప్‌ పర్వతం కింద 1399 చిన్న భూకంపాలు ఏర్పడినట్టు మ్యాచ్డ్‌-ఫిల్టర్‌ డిటెక్షన్‌ సాంకేతికత ద్వారా కనుగొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News