Kaizer News

రూ.2 లక్షలు చెల్లిస్తే Maruti Brezza Top Model కోస

రూ.2 లక్షలు చెల్లిస్తే Maruti Brezza Top Model కోసం ప్రతినెలా EMI ఎంత కట్టాలి

· State - Telangana · telugu.abplive.com

మారుతి బ్రెజ్జా పెట్రోల్, CNG, మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తుంది. రెండు లక్షల డౌన్ పేమెంట్‌తో, మిగిలిన మొత్తానికి EMI చెల్లించవచ్చు. టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మీరు ఫ్యామిలీ కోసం మంచి డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ ఇంజిన్, బెస్ట్ ఫీచర్లతో వచ్చే కాంపాక్ట్ SUV ని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మారుతి బ్రెజ్జా (Maruti Brezza) మీకు మంచి ఆప్షన్ కావచ్చు. భారత మార్కెట్లో చాలా ఆదరణ పొందిన SUV మారుతి బ్రెజ్జా. ఇది పెట్రోల్‌తో పాటు CNG, మ్యాన్యువల్- ఆటోమేటిక్ 2 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మీరు కారును పూర్తి పేమెంట్ చేయకుండా కొంత డౌన్2పేమెంట్ చేసి, EMI ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే ఫైనాన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీతో సుమారు రూ. 2 లక్షలు ఉంటే, మిగిలిన మొత్తాన్ని EMI ద్వారా మీ టర్మ్ వరకు చెల్లించవచ్చు. మారుతి బ్రెజ్జా ధర వేరియంట్‌ను బట్టి ఆయా రాష్ట్రాలు, నగరాల్లోనే వేర్వేరుగా ఉంటుంది. బేస్ వేరియంట్ నుంచి ఎక్కువ ఫీచర్లు ఉండే టాప్ వేరియంట్ వరకు దీని ధరలో వ్యత్యాసం ఉంటుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఎక్స్-షోరూమ్ ధర కాదు, ఆన్ రోడ్ ధర చెక్ చేయాలి. ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు RTO, ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన ఛార్జీలు కూడా జతచేస్తే కారు ఆన్-రోడ్ ధర అవుతుంది. మీరు బ్రెజ్జా కొనుగోలు చేయడానికి రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ద్వారా కార్ లోన్ తీసుకోవచ్చు. డౌన్ పేమెంట్ తర్వాత మిగిలిన మొత్తాన్ని లోన్‌లో చేర్చి EMI అంచనా వేస్తారు. లోన్ మొత్తం, EMI అనేవి బ్యాంక్ వడ్డీ రేటు, లోన్ కాలపరిమితి, క్రెడిట్ ప్రొఫైల్, ఇతర కండీషన్లను బట్టి మారవచ్చు. ఒకవేళ బ్యాంక్ నుంచి సుమారు 9 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ తీసుకుంటే, EMI అనేది లోన్ మొత్తం, కాలపరిమితిని బట్టి నిర్ణయిస్తారు. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే ప్రతి నెలా చెల్లించే EMI తగ్గుతుంది, కానీ వడ్డీ పెరుగుతుంది. తక్కువ కాలపరిమితితో లోన్ తీసుకుంటే నెలానెలా చెల్లించే EMI పెరిగినా, చెల్లించే వడ్డీ తగ్గుతుంది. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే సుమారు రూ. 12.62 లక్షల లోన్‌పై 9 శాతం వడ్డీతో 7 సంవత్సరాలకు నెలకు దాదాపు EMI రూ. 20,318 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కింపు ప్రకారం 7 ఏళ్లలో సుమారు రూ. 4.43 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు. కారుకు అయ్యే ఖర్చును లెక్కించేటప్పుడు డౌన్ పేమెంట్, EMI ని మాత్రమే కాదు లోన్‌పై పడే వడ్డీ కూడా చెక్ చేసుకోవాలి. మారుతి బ్రెజ్జాలో వినియోగదారులకు పలు మోడ్రన్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్-అప్ డిస్ప్లే, సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, హిల్-హోల్డ్ కంట్రోల్, ESP, ISOFIX, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో అయితే 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి. . సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే! మారుతి బ్రెజ్జాలో

Original source: telugu.abplive.com
Read more on Kaizer News