Kaizer News

Nayanthara: ‘టాక్సిక్’ డిజాస్టర్‌పై నయనతార షాకింగ్

Nayanthara: ‘టాక్సిక్’ డిజాస్టర్‌పై నయనతార షాకింగ్ కామెంట్స్.. గుణపాఠం నేర్పిందంటూ!

· Entertainment · hmtvlive.com

Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై విడుదల ముందే ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర నిరాశ పరిచింది. బిగ్ బడ్జెట్ చిత్రంగా వచ్చి పరాజయం పాలవ్వడంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార, ‘టాక్సిక్’ ఫలితంపై స్పందిస్తూ సినీ పరిశ్రమలోని గెలుపోటములపై తనకున్న పరిణతి చెందిన దృక్పథాన్ని పంచుకున్నారు. సినిమా నిర్మాణం ,దాని ఫలితాల గురించి నయనతార మాట్లాడుతూ..ఒక సినిమాను ఎలా తీస్తారు అనే దానిపై ఇండస్ట్రీలో ఉండే అనుభవం మనకు ఒక ప్రాథమిక అవగాహనను ఇస్తుంది. కానీ సినిమా అనేది ఎంతో భావోద్వేగభరితమైనది, అలాగే ఊహించని మలుపులతో కూడుకున్నది. నా కెరీర్‌లో నేను ఎన్నో ఆశలు పెట్టుకుని, ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతాయని నమ్మిన కొన్ని సినిమాలు నేను ఆశించినంత విజయం సాధించలేకపోయాయి. అదే సమయంలో, కొన్ని చిత్రాల ఫలితంపై నాకే సందేహాలు ఉండేవి, కానీ అవి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాయని నయనతార చెప్పుకొచ్చింది. సంవత్సరాల తరబడి సాగిన తన సినీ ప్రయాణం నేర్పిన పాఠాల గురించి నయనతార స్పష్టం చేస్తూ..చిత్ర పరిశ్రమలో నా అనుభవం నాకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పింది. ఒక సినిమా విజయాన్ని అయినా, లేదా అపజయాన్ని అయినా సరే.. రెండింటినీ ఒకే విధమైన సమచిత్తతతో, వినయంతో స్వీకరించడం నేను నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, ఓటమిని అంతే హుందాగా, సమచిత్తతతో స్వీకరించిన లేడీ సూపర్ స్టార్ మైండ్‌సెట్‌ను నెటిజన్లు, సినీ వర్గాలు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నాయి. గెలుపును నెత్తికెత్తుకోకుండా, ఓటమికి కుంగిపోకుండా ముందడుగు వేయడమే అసలైన సూపర్ స్టార్ లక్షణమని అభిమానులు కొనియాడుతున్నారు. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News