ఏ కాలువకు అనుసంధానం చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణకు వినూత్నంగా వినతిపత్రం మానవపాడు, ఆంధ్రప్రభ: ఉండవల్లి మండలం మారమునగాల వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి 32ఏ కాలువకు అనుసంధానం చేయాలని కోరుతూ రైతులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. జోగులాంబ ఆలయాలు, జోగులాంబ హాల్ట్ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వచ్చిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు రైతులు మోకాళ్లపై కూర్చొని వినతిపత్రం అందజేశారు. మారమునగాల వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి 32ఏ కాలువకు నీటిని అనుసంధానం చేస్తే సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని రైతులు వివరించారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కేంద్ర మంత్రి, ఎంపీని కోరారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లిఫ్ట్ ఏర్పాటు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శేషన్‌గౌడ్, తక్కశీల సుంకన్న, శేషన్న, కంచుపాడు రైతు సంఘం సభ్యులు గొందిమల్ల సురేష్, వడ్డెమాన్ వెంకటేశ్వరరెడ్డి, అడ్డాకుల రాజు తదితరులు పాల్గొన్నారు