Kaizer News

నోటీసులు వచ్చిన వారికి మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

నోటీసులు వచ్చిన వారికి మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

· State - Telangana · prabhanews.com

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డ వద్ద ఉన్న మదర్స్ పాఠశాల ప్రాంగణంలో శనివారం 16, 20వ వార్డులలో అధికారులు సర్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల సర్వే ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన వారికి సంబంధించిన మ్యాపింగ్ కార్యక్రమాన్ని బిఎల్ఓలు ఎండీ షఫీయా, మల్లమ్మతో పాటు బిఎల్ఏలు ఎండీ బాబాషరీఫ్, యు. వెంకటేశం గౌడ్ ముమ్మరంగా చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ మ్యాపింగ్ పూర్తి చేస్తున్నారు. ​ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ ఎండీ హన్నుభాయ్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ ఎండీ బాబాషరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ కరీం, మాజీ చైర్మన్ ఎండీ ఎజాజ్ పాషా, స్థానిక నాయకులు బాబా, అఫ్రీద్, పాషా, మైలారం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News