Kaizer News

Riyadh-Houthi-Missile-Drone-Attacks : రియాద్ హైటెన

Riyadh-Houthi-Missile-Drone-Attacks : రియాద్ హైటెన్ష‌న్‌,, :Andhra prabha Top News

· National - India · prabhanews.com

రియాద్ హైటెన్ష‌న్‌,, :Andhra prabha Top News మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్‌ ఘర్షణతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో.. తాజాగా సౌదీ అరేబియా, యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. సౌదీ రాజధాని రియాద్‌లోని కీలక ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించడం కలకలం రేపింది. మరోవైపు, రియాద్‌ ప్రధాన విమానాశ్రయం సమీపంలో మంటలు ఎగసిపడటం, భారీగా పొగలు కమ్ముకోవడం ఆందోళనకు దారితీసింది. , ఈ ఘటనకు హౌతీల దాడులకు మధ్య సంబంధం ఏమిటన్నది స్పష్టతకు రాలేదు. శనివారం రియాద్‌లోని సున్నితమైన, కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే, ఏయే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారన్న వివరాలను వెల్లడించలేదు. మరోవైపు, యెమెన్‌ రాజధాని సనాపై జరిగిన దాడికి ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రియాద్‌లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో మంటలు, దట్టమైన పొగలు కనిపించిన కొన్ని గంటలకే హౌతీల దాడుల ప్రకటన వెలువడింది. శనివారం తెల్లవారుజామున రియాద్‌ వైపు యెమెన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణిని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సైనిక సంకీర్ణ దళాలు వెల్లడించాయి రాజధాని రియాద్‌తో పాటు తూర్పున ఉన్న అల్‌ ఖర్జ్‌ నగరంలో వైమానిక దాడుల ముప్పు పొంచి ఉందంటూ సౌదీ పౌర రక్షణ విభాగం రాత్రివేళ మొబైల్‌ ఫోన్లకు హెచ్చరికలు పంపింది. శనివారం ఉదయం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ప్రకటించింది. అంతకుముందు రియాద్‌లోని ఒలాయా ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించాయ‌ని స‌మాచారం. నైరుతి సౌదీలోని బిష్‌, ఫరాసన్‌, పశ్చిమాన ఉన్న తాయిఫ్‌, ఎర్ర సముద్ర తీరంలోని యన్బూ నగరాల్లో పౌరులను లక్ష్యంగా చేసుకున్న దాడులను కూడా విఫలం చేసినట్లు సంకీర్ణ దళాలు తెలిపాయి. అయితే, ఈ ఘటనల్లో ఎంతమేర నష్టం వాటిల్లిందన్న వివరాలను వెల్లడించలేదు. సౌదీ అరేబియాలోని కీలక చమురు ఎగుమతి కేంద్రం యన్బూలో ఉన్న అరామ్‌కో సదుపాయంపైనా దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఎర్ర సముద్ర తీరంలో ఉన్న యన్బూ.. గల్ఫ్‌ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులకు కీలక కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సౌదీ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చమురు సరఫరాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.జులైలో హౌతీలు దాడులు ఉధృతం చేసిన తర్వాత సౌదీ అరేబియాపై వరుస దాడులు జరుగుతున్నాయి. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి రియాద్‌పై దాడి జరిగినట్లు వెలువడిన తొలి నివేదిక ఇదేనని తెలుస్తోంది. ఈ ఏడాది అమెరికా-ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత రియాద్‌లో కొన్ని హెచ్చరికలు జారీ అయినప్పటికీ.. హౌతీలతో ఘర్షణ తీవ్రతరమైన తర్వాత తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో మొదలైన విస్తృత యుద్ధం.. ఇప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. హౌతీలు జులైలో సౌదీ అరేబియాపై నౌకాదళ దిగ్బంధనాన్ని ప్రకటించిన తర్వాత.. ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుని ద

Original source: prabhanews.com
Read more on Kaizer News