బుజ్జాయిలూ! అంతరిక్ష శాస్త్రవేత్తలు చందమామపై ఒక కొత్త విశేషాన్ని కనుగొన్నారు! అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ప్రత్యేక శాటిలైట్ చంద్రుని ఉపరితలాన్ని ఫోటోలు తీస్తుండగా ఒక భారీ గుంత కనిపించింది. సాధారణ గుంత అనుకుంటే పొరపాటే.. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, వందేళ్ల కాలంలో చంద్రుడిపై పడిన అత్యంత పెద్ద గుంత ఇదేనట! ఇది 222 మీటర్ల వెడల్పు, 43 మీటర్ల లోతు ఉంది. దీనికి ‘మెక్‌గెట్చిన్’ అని పేరు కూడా పెట్టారు. భూమికి చుట్టూ రక్షణగా గాలిపొర ఉంటుంది కాబట్టి అంతరిక్షం నుండి వచ్చే ఆస్ట్రాయిడ్స్ గాలిలోనే మండిపోయి నశిస్తాయి. కానీ చందమామపై గాలి, నీరు, వాతావరణం ఏవీ ఉండవు. అందుకే అంతరిక్షంలో తిరిగే పెద్ద పెద్ద గ్రహశకలాలు ఎలాంటి అడ్డు లేకుండా నేరుగా వచ్చి చంద్రుడిని బలంగా ఢీకొడతాయి. అలా ఒక పెద్ద రాయి వచ్చి గుద్దుకోవడం వల్లే ఈ సరికొత్త భారీ గుంత ఏర్పడింది. దీని లోపల దాగి ఉన్న మట్టి, రాళ్లను పరిశీలిస్తే చందమామ లోపల ఏముందో మనకు తెలిసిపోతుంది. భవిష్యత్తులో మన శాస్త్రవేత్తలు లేదా వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఇళ్లు ఎలా కట్టుకోవాలి, ప్రమాదకరమైన సూర్యకిరణాల నుండి ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవడానికి ఈ గుంత సహాయపడుతుంది. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే