Vaibhav Sooryavanshi : పదిహేనేళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరో ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయస్కుడిగా పలు రికార్డులు నెలకొల్పిన వైభవ్.. ఈసారి కెప్టెన్సీ చేపట్టాడు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ కుర్రాడు.. సెమీఫైనల్లో సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) గాయపడడంతో.. డిప్యూటీ అయిన వైభవ్ ఈస్ట్ జోన్ పగ్గాలు అందుకున్నాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతి చిన్నవయస్కుడైన సారథిగా చరిత్ర సృష్టించాడీ డాషింగ్ ఓపెనర్. విధ్వంసక ఆటకు కేరాఫైన వైభవ్ పదిహేనేళ్లకే కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. 2024లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వైభవ్.. రెండేళ్లకే సారథిగా అవకాశం దక్కించుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు.. ఆదివారం సౌత్ జోన్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ చేతికి గాయమవ్వడంతో అతడు మైదానం వీడగా.. వైభవ్ బాధ్యతలు తీసుకున్నాడు. తనకంటే రెండింతలు వయసులో పెద్దవారైనా మహమ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, ముకేశ్ కుమార్‌లకు 15 ఏళ్ల వైభవ్ నాయకత్వం వహించడం విశేషం. మొదటిసారి దులీప్ ట్రోఫీ ఆడుతున్న వైభవ్ నాయకుడిగా తొలి మ్యాచ్‌లోనే బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులతో ఆకట్టకున్నాడు. ముకేష్ కుమార్ ఓవర్లో ఆర్యన్ జుయల్ ఆడిన బంతి..ఎడ్జ్ తీసుకోగా వికెట్ ఒడుపుగా అందుకున్నాడు. అయితే.. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. తటపటాయిస్తూనే రివ్యూ తీసుకొని విజయవంతమయ్యాడు వైభవ్. దాంతో, తొలి రోజే సెంట్రల్ జోన్ జట్టు 266 పరుగులకే ఆలౌటైంది. రింకూ సింగ్(60), అర్యన్ జుయల్(46)లు మాత్రమే పర్వాలేదనిపించారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అభిజిత్(3-38), ముకేశ్ కుమార్(3-56)లు మూడేసి వికెట్లు తీయగా.. షమీ, ఖురేషిలు రెండేసి వికెట్లతో రాణించారు. ఐపీఎల్‌లో రికార్డు శతకాలతో జాతీయ జట్టులోకి వచ్చిన వైభవ్ జింబాబ్వే పర్యటనలో మెరిశాడు. ఇప్పుడు దేశవాళీలోనూ అదరగొడుతున్నాడీ కుర్ర సంచలనం. ప్రతిసారి తుఫాన్ ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచే వైభవ్ ఈసారి బంతితో మ్యాజిక్ చేశాడు. ఎడమ చేతివాటం స్పిన్నరైన అతడు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లతో ఔరా అనిపించాడు. బ్యాటుతో 8 పరుగులే చేసినా ఆ రెండు వికెట్లతో ఈస్ట్ జోన్ సెమీస్ చేరడంలో తనవంతు పాత్ర పోషించిన అతడు.. తాను బౌలింగ్ చేస్తాననే విషయం కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు తెలియదని చెప్పాడు. నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై నాలుగు బంతుల్లోనే 2 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. తమ జట్టు సెమీస్ చేరడంలో కీలకమైన అతడు ‘నేనూ వికెట్లు తీయగలను అని మా కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు తెలియదు’ అని పేర్కొన్నాడీ యువ సంచలనం. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ 210 పరుగులతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది