Kaizer News

Ambas Revenge: తెలుగులో ఫస్ట్ ఏఐ సినిమా... మహాభారత

Ambas Revenge: తెలుగులో ఫస్ట్ ఏఐ సినిమా... మహాభారతంలోని కథతో... అంబాస్ రివేంజ్ టీజర్ రిలీజ్

· Entertainment · telugu.abplive.com

'అంబాస్ రివేంజ్' తొలి తెలుగు ఏఐ చిత్రంగా విడుదల కానుంది. టీజర్ భీష్ముడిపై అంబ ప్రతీకారాన్ని, అశ్వత్థామ పాత్రను చూపింది. ఏఐ నిర్మాణం సవాలుగా ఉందని, త్వరలో ట్రైలర్ వస్తుందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు మహాభారతం కొత్త కాదు. భారతంలోని పలు అంశాలను పలు చిత్రాల్లో తమ తమ కోణాల్లో ఆవిష్కరించారు దర్శక రచయితలు. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లోనూ కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు మహాభారతంలోని ఓ కథను ఏఐ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు జైవర్ధన్ మేడి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'అంబాస్ రివేంజ్'. తెలుగులో తీసిన తొలి ఏఐ చిత్రమిది. ఇటీవల టీజర్ విడుదల చేశారు. అది ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. అంబ ప్రతీకారం... భీష్మ, అశ్వత్థామ పాత్రలతో! జైవర్ధన్ మేడి దర్శకత్వంలో 'అంబాస్ రివేంజ్'ను నక్క తోక ఫిలిమ్స్ పతాకంపై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మించారు. త్వరలో సినిమాను విడుదల చేయనున్నారు. కిషోర్ కుమార్ ఏనుగు మాటలు, పాటలు రాసిన ఈ చిత్రానికి ప్రమోద్ ఎంసి సంగీత దర్శకుడు. హ్యారీ బ్రెయిన్ ఎడిటింగ్ & డిఐ చేశారు. టీజర్ ఎలా ఉంది? అనేది చూస్తే... ''పరశురాముని ఆగ్రహాన్ని ఎదిరించి అపరాజితుడిగా నిలిచిన ఏకైక యోధుడు... అడుగు పెట్టిన ప్రతి రణరంగంలోనూ అతడిదే విజయం... ఎన్నడూ నెలకు ఒరగని ఖడ్గం... తన అంతిమ ఘడియలు సమీపించాయని ఆ పితామహుడికి తెలుసు'' అంటూ 'అంబాస్ రివేంజ్' టీజర్ ప్రారంభమైంది. ఆ మాటలు చెప్పేది భీష్మ పితామహుని గురించి అని అర్థం అవుతుంది. అయితే... ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ''ఒక యోధుని దేహంలో దహించుకుపోతున్న స్త్రీ ఆత్మ... జన్మ జన్మలను దాటుకుని రగులుతోన్న ప్రతీకార జ్వాల... ఓటమి ఎరుగని పితామహుడిని కూల్చేందుకు ముల్లోకాల్లో విధి చేత సృష్టించబడ్డ ఆయుధం'' అంటూ చెప్పిన డైలాగులు అంబ గురించి అన్నమాట. .. జీ5లో ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ''పుట్టకతో బ్రాహ్మణుడు... కాలచక్రంలో క్షత్రియుడు... కౌరవ సామ్రాజ్యపు ఆఖరి అస్త్రం... పుట్టబోయే ప్రాణాలను అంతం కోరినందుకు రాబోయే తరాలను అతడే కాపాడాలి ఇది దైవ నిర్ణయం. విధి ముందే రాయబడినది కాదు... అది కర్మపాశాలతో నేయబడుతుంది'' అంటూ టీజర్ ముగించారు. ఏఐ విజువల్స్ చూస్తే... 'అంబాస్ రివేంజ్'లో అశ్వత్థామ పాత్ర కూడా ఉందని అర్థం అవుతోంది. మొత్తం మీద సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో టీజర్ సక్సెస్ అయ్యింది. .. నిహారికతో 'బరి'పై వరుణ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్ మహాభారతంలో భీష్మ పితామహుని వల్ల ఒక జన్మలో మరణించిన స్త్రీ, మరొక జన్మ ఎత్తి తన పగ, ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంది? అనేది 'అంబాస్ రివేంజ్' మెయిన్ ప్లాట్ అని దర్శకుడు జైవర్థన్ మేడి తెలిపారు. టీజర్ విడుదల కార్యక్రమంలో చిత్ర నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ... "ఎఐలో సినిమా చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాబ్మాకు ఎక్కువ ఖర్చు చేశాం. ఒక టూల్ తర్వాత మరొక టూల్... రోజుకొక కొత్త టూల్ వస్తుంది. అందువల్ల, మేం ఎంతో కష్టపడ్డాం. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది'' అని అన్నారు. దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుత

Original source: telugu.abplive.com
Read more on Kaizer News