నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర,కళాశాల హాస్టల్‌ను ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర నాయకులతో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, అందుతున్న భోజన నాణ్యత, విద్యార్థుల భద్రతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తుంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యాభివృద్ధికి తోడ్పాటు అనిపించాలి. కార్యక్రమంలో స్థానిక వైస్ చైర్మన్ బాదం రమేష్ కౌన్సిలర్ నిజాముద్దీన్, నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, నరసింహారెడ్డి కృష్ణారెడ్డి నాయకులు పాల్గొన్నారు