Kaizer News

Antarvedi: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్

Antarvedi: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న విజందిరా బోయి!

· State - Telangana · hmtvlive.com

Shorts Antarvedi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి విజందిరా బోయి, ఐ.ఏ.ఎస్., కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం నిర్వహించారు. శ్రీస్వామివారి దర్శనం అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కె.టి.ఎన్.వి. ప్రసాద్ ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News