Kaizer News

Harish Rao | లాగ్‌బుక్స్‌ మాయం.. ప్రజా సమస్యలు వది

Harish Rao | లాగ్‌బుక్స్‌ మాయం.. ప్రజా సమస్యలు వదిలేసి మా పొలాల దగ్గర తిరుగుతున్నారు : హరీశ్‌ రావు

· State - Telangana · ntnews.com

Harish Rao | తాను సబ్ స్టేషన్ సందర్శనకు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు మండిపడ్డారు. మోటకొండూర్ పర్యటనలో భాగంగా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా ఎప్పుడైనా సబ్‌స్టేషన్లో ఎప్పుడైనా లాగ్‌ బుక్స్ ఉంటాయి. ఎప్పుడు కరెంట్ వచ్చింది.. ఎప్పుడు 3 ఫేజ్ కరెంట్‌ తీసేశారు. మధ్యలో ఎన్నిసార్లు ట్రిప్‌ అయ్యింది.. నెట్టుగా 3ఫేజ్‌ కరెంట్ రైతులకు ఎన్ని గంటలు ఇచ్చారనేది లాగ్‌ బుక్స్‌లో నమోదు చేయడం విద్యుత్‌ ఉద్యోగుల పద్దతి, ఆనవాయితీ. కరెంట్ ఎన్ని గంటలు వస్తుందో చూద్దామని సబ్‌స్టేషన్‌కు వచ్చాం. 6-7 గంటలు కూడా కరెంట్ వస్తలేదు.. బాగా ఇబ్బంది అవుతుందని మోటకొండూర్ రైతులు చెప్పింది మీరు కూడా చూశారన్నారు. మోటకొండూరు రైతులు కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని చెప్తే, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వచ్చాము. ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రజా సమస్యలను వదిలేసి మా పొలాల దగ్గర తిరుగుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బఫర్ జోన్లలో కట్టిన కాంగ్రెస్ నాయకుల ఫాంహౌసుల వద్దకు కూడా మీరు వెళ్లి పరిశీలించారా.. ? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి మేము నిలదీస్తే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న మా ఆస్తుల దగ్గరికి వెళ్తే ఏం లాభం..? మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని హరీశ్ రావు హెచ్చరించారు. నేను సబ్ స్టేషన్ సందర్శనకు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు మోటకొండూరు రైతులు కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని చెప్తే, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వచ్చాము ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రజా సమస్యలను… https://t.co/2ay9Y7ElT4 pic.twitter.com/1VXuqgGHYw ATMs | కరీంనగర్‌లో ఏటీఎంలలో దొంగలు హల్‌చల్ : వీడియో Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్‌ గౌన్‌లో మెరిసిన నభా నటేష్‌.. ఫొటోలు వైరల్! Watch: ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె కుటుంబం కిడ్నాప్‌.. తర్వాత ఏం జరిగిందంటే..?

Original source: ntnews.com
Read more on Kaizer News