Kaizer News

పతక వేటకు భారత్‌ సై

పతక వేటకు భారత్‌ సై

· National - India · ntnews.com

మెగా గేమ్స్‌లో భారత్‌ ఆదివారం పలు ఆటల్లో బరిలోకి దిగనుంది. మూడు క్రీడల్లో పతక అవకాశాలున్నాయి. ఉషు, టెక్‌బాల్‌తో పాటు భారీ అంచనాలున్న షూటర్లు పతక వేట ప్రారంభించే చాన్సుంది. మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్లలో వలారివన్‌, సోనమ్‌, విదర్శ బరిలో నిలిచారు. మహిళల టీ20 సెమీస్‌లో బంగ్లాదేశ్‌ పని పట్టి స్వర్ణ పతక పోరుకు చేరుకోవాలని హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీలోని క్రికెట్‌ జట్టు పట్టుదలగా ఉంది. అదే సమయంలో పురుషుల, మహిళల హాకీ జట్లు ఒలింపిక్‌ బెర్త్‌పై గురి పెట్టాయి. పూల్‌-ఎ తొలి పోరులో పురుషుల జట్టు ఇండోనేషియాతో, మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌తో తలపడతాయి.టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌లో మన జట్లు టీమ్‌ ఈవెంట్లతో పోటీని ఆరంభిస్తున్నాయి. నేడు భారత అథ్లెట్ల మెడల్‌ ఈవెంట్ల షెడ్యూల్‌ ఉషు: పురుషుల చాంగ్‌క్వాన్‌ ఫైనల్‌ సూరజ్‌ సింగ్‌- ఉదయం 5:30: షూటింగ్‌: మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్స్‌ వలారివన్‌, సోనమ్‌, విదర్శ-ఉదయం 6:15 నుంచి టెక్‌బాల్‌ : మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరు క్విన్సీ డిసౌజా x సకామోటో (జపాన్‌)-ఉదయం 6:30; మిక్స్‌డ్‌ డబుల్స్‌ కాంస్య పోరు క్విన్సీ -అనస్‌ x హోంగ్‌ మిన్‌ -గియా (వియత్నాం)-ఉదయం 7:00 మహిళల టీ20 క్రికెట్‌: సెమీఫైనల్‌ భారత్‌ x బంగ్లాదేశ్‌- ఉదయం 10:30

Original source: ntnews.com
Read more on Kaizer News