Kaizer News

డెత్‌ సర్టిఫికెట్‌ వస్తే.. ఓటు ఔట్‌!

డెత్‌ సర్టిఫికెట్‌ వస్తే.. ఓటు ఔట్‌!

· State - Telangana · ntnews.com

మరణ రిజిస్ట్రేషన్‌ డాటాతో ఓటర్‌ ఐడీ అనుసంధానం ట్రయల్స్‌ దశలో కొత్త టెక్నాలజీ హైదరాబాద్‌, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా, ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచేందుకు ఎన్నికల అధికారులు కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నారు. డెత్‌ సర్టిఫికెట్‌ జారీ కాగానే ఓటరు జాబితా నుంచి మరణించిన వ్యక్తి పేరు తొలగిపోయేలా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందు కు జనన, మరణ రిజిస్ట్రేషన్‌ డాటాబేస్‌ను ఓటరు గుర్తింపు వివరాలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ట్రయ ల్స్‌ దశలో ఉన్నది. మరో రెండు నెలల్లో ఈ వి ధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త విధానంలో ఒక వ్యక్తి మరణం అధికారికంగా రిజిస్టర్‌ అయిన వెంటనే ఆ వివరాలు ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటరు డాటాబేస్‌కు చేరుతాయి. అనంతరం అధికారులు ఆ వివరాలను పరిశీలిస్తారు. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత మరణించిన వ్యక్తి వివరాలను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. ప్రస్తుతం మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించేందుకు అధికారులు ప్రధానం గా బూత్‌ లెవల్‌ అధికారుల(బీఎల్‌వో)పై ఆధారపడుతున్నారు. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి మరణించిన ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం సంబంధిత ఓటరు పేరును జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులు కూడా ఫామ్‌-7 సమర్పించి ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపజేసేందుకు అ వకాశం ఉన్నది. రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్‌’ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 9,22,229 మంది ఓటర్లు చనిపోయినట్టు గుర్తించారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎకువ ప్రాంతా ల్లో ఓటు హక్కు ఉండే పరిస్థితికి కూడా త్వర లో చెక్‌ పడనున్నది. దేశవ్యాప్తంగా ‘సర్‌’ ప్రక్రి య పూర్తయిన తర్వాత ఒకటికంటే ఎకువచోట్ల ఓటు నమోదైనవారిని గుర్తించేందుకు ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఎన్నికల సంఘం వినియోగించనున్నది. ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్న ‘సర్‌’ ప్రక్రియలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఓటరు జాబితాల్లో ఒకే విధమైన లేదా దగ్గరగా సరిపోలే ఫొటోలను గుర్తించేందుకు ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌ (పీఎస్‌ఈ) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఏఐ సిస్టమ్‌ ఇలాంటి ఎంట్రీలను గుర్తించి బీఎల్‌వోలు, ఈఆర్‌వోల పరిశీలనకు పంపుతున్నది. మరోవైపు డెమోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (డీఎస్‌ఈ) సాంకేతికత ఓటర్ల వ్యక్తిగత వివరాలను పోల్చుతున్నది. ఇందులో ప్రధానంగా ఓటరు పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి పేరు, వయసు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను పరిశీలిస్తుంది. ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఒకే వ్యక్తికి సంబంధించిన అనుమానాస్పద లేదా డూప్లికేట్‌ ఎంట్రీని గుర్తించినంత మాత్రాన ఓటరు పేరు వెంటనే తొలగించరు. ఏఐ సిస్టమ్‌ ఫ్లాగ్‌ చేసిన తర్వాత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమాచారం ఇస్తుంది. అకడి నుంచి జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్‌వోలకు సమాచారం చేరుతుంది. అనంతరం బీఎల్‌వోల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతారు. ఓటరు వివరాలు నిజంగా డూప్లికేట్‌ అని నిర్ధారణ కావడంతోపాటు, సంబంధిత ఓటరు సమ్మతి పొందిన తర్వాత తొలగింపు ప్రక్ర

Original source: ntnews.com
Read more on Kaizer News