Kaizer News

Anantapur: పల్లె ఉమా 8వ వర్ధంతి: ఘనంగా నివాళులర్పి

Anantapur: పల్లె ఉమా 8వ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన పల్లె రఘునాథ్ రెడ్డి!

· State - Telangana · hmtvlive.com

అనంతపురం: మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భార్య పల్లె ఉమా 8వ వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను స్మరించుకున్నారు. పల్లె ఉమా భౌతికంగా తమను విడిచి ఎనిమిదేళ్లు పూర్తయినా, ఆమె జ్ఞాపకాలు తమ మదిలో నిత్యం చిరస్మరణీయంగానే ఉన్నాదని పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. పల్లె ఉమా కేవలం ఒక పేరు కాదని. అదొక శకం. ఒక విద్యా వ్యవస్థ అని కొనియాడారు. ఒకవైపు గృహిణిగా కుటుంబానికి కొండంత అండగా నిలుస్తూనే. మరోవైపు విద్యావేత్తగా, సామాజిక వేత్తగా, మానవతావాదిగా సమాజ శ్రేయస్సు కోసం ఆమె అందించిన సేవలు అనితరసాధ్యమని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో అనంతపురం జిల్లాలో 67 విద్యా సంస్థల స్థాపనలో పల్లె ఉమా కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆమె స్థాపించిన విద్యాసంస్థల ద్వారా ఎన్నోవేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించారని చెప్పారు. నేడు విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడిన ఎంతోమంది విద్యార్థులకు. ఆమె స్థాపించిన విద్యాసంస్థలే బలమైన పునాదిగా నిలిచాయని గుర్తుచేశారు. అనాథలు, శరణాలయాలు, పేద విద్యార్థులకు ఒక తల్లిలా అండగా నిలిచి. కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పల్లె ఉమా అని కొనియాడారు. కుటుంబ సభ్యులకు రాజకీయ మార్గదర్శిగా కూడా ఆమె నిలిచారని పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పల్లె ఉమా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ... ఆమెకు ఘన నివాళులు అర్పించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News