Kaizer News

Mahabubabad: డోర్నకల్ పాఠశాలల్లో కలెక్టర్ స్నేహ శబ

Mahabubabad: డోర్నకల్ పాఠశాలల్లో కలెక్టర్ స్నేహ శబరీష ఆకస్మిక తనిఖీ!

· State - Telangana · hmtvlive.com

Shorts మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ఎంపీపీఎస్ పాఠశాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి విద్యాబోధన, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణలో, విద్యార్థుల పట్ల బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News